దర్శకుడు రవిబాబు సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూర్ణ.

అవును-1, అవును-2 సినిమాలతో హారర్ సినిమాలకు పర్ఫెక్ట్ ఛాయస్ అయ్యిపోయింది.

ఆ తరువాత టీవీ షోలతో తెలుగు వారికీ మరింత దగ్గరైంది.

ఇక గత ఏడాది సీక్రెట్‌గా కేరళకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది.

ఆ విషయాన్ని కొన్ని రోజులకు అభిమానులకు తెలియజేసిన పూర్ణ..

అప్పటి నుంచి తన ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

ఇటీవల దుబాయ్‌లో ఘనంగా సీమంతం జరుపుకున్న ఫోటోలను కూడా షేర్ చేసింది.

తాజాగా అమ్మతనంలోకి అడుగుపెడుతున్న అనుభవాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.