పుచ్చకాయ తిన్నాక.. అస్సలు తినకూడని ఆహార పదార్థాలు.!
పుచ్చకాయ తిన్నాక కొన్ని ఆహారాలను తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదట.
ఒకవేళ తీసుకుంటే మాత్రం కడుపులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
పుచ్చకాయతో కొన్ని రకాల ఆహారపదార్ధాల కలయిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం.
పుచ్చకాయ తిన్న తర్వాత పాలకు దూరంగా ఉండండి.
పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది.
పుచ్చకాయ తిన్నాక పాల ఉత్పత్తులను తింటే కడుపు ఉబ్బరం కలుగుతుంది.
జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి.
పుచ్చకాయ తిన్న తర్వాత ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల హాని.
పుచ్చకాయలో విటమిన్లు, ఖనిజాలు, కొంత పిండిపదార్థం కూడా ఉంటుంది.
పప్పులు వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం జీర్ణ ఎంజైమ్‌లను దెబ్బతీస్తుంది. కడుపుకు హానికరం.
పుచ్చకాయ తిన్న తర్వాత గుడ్డు వద్దు
పుచ్చకాయ తిన్న తర్వాత గుడ్డు తినడం వల్ల అనేక పొట్ట సమస్యలు వస్తాయి.
ప్రోటీన్‌తో పాటు గుడ్లలో ఒమేగా-3 వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
పుచ్చకాయ నీరు అధికంగా ఉండే పండు.
ఈ రెండూ ఒకదానికి ఒకటి కలిస్తే జీర్ణం కాకుండా నిరోధిస్తాయి.
కడుపులో ఉబ్బరం, మలబద్ధకం కలిగిస్తాయి.
పుచ్చకాయ తిన్న తర్వాత ఈ ఆహారాలను తీసుకోకుండా ఉండటం మంచిది.
పుచ్చకాయ తిన్నప్పుడల్లా, దాదాపు 30 నిమిషాల వరకు ఏమీ తినకండి.
ఇలా చేయటం వల్ల దానిలోని పోషకాలను శరీరం గ్రహిస్తుంది.