గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన చూసైనా కొందరు మారటం లేదు. 

ఈ దుర్ఘటన నుంచి పాఠం నేర్చుకోవడం లేదు.

కేబుల్ బ్రిడ్జిల దగ్గర అప్రమత్తంగా ఉండాల్సింది పోయి మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

కర్నాటకలో దారుణం.. తీగల వంతెనపైకి కారు ఎక్కించిన టూరిస్టులు.

ఉత్తర కన్నడ జిల్లా యెల్లపురాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శివపుర కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ఘటన.

మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు టూరిస్టులు సస్పెన్షన్ బ్రిడ్జిపైకి ఏకంగా కారును తీసుకొచ్చారు. 

ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. 

కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు.

బైక్ లు, నడక కోసమే ఈ వంతెన ఏర్పాటు.

ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఎవరిది బాధ్యత?