ఎండవేడి కారణంగా, వయసు పైబడుతున్నవారిలో చర్మం నునుపుదనం తగ్గుతుంది.

కాలుష్యం కారణంగా కూడి ముఖంపై నునుపుదనం తగ్గుతుంది. 

ఈ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని యాంటీ ఏజింగ్‌ ఫేస్‌ మాస్కులు మేలు చేస్తాయి.

స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల పెరుగు, ఆరస్పూన్ తేనె, ఐదారు చుక్కల గ్లిజరిన్ కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడగాలి. 

వేసవి కాలంలో శనగపిండి సరిపడని శరీర తత్త్వం గలవారు పెసరపిండితో ప్యాక్ వేసుకోవచ్చు.

పుచ్చకాయ రసం, కమలా పండు రసం, మామిడి పండు గుజ్జు, దోసకాయ గుజ్జు… దేనినైనా ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే చర్మం లావణ్యంగా ఉంటుంది.

బంతి, చామంతి, గులాబీ వంటి పూల రెక్కలను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేస్తే చర్మం నునుపుదనం సంతరించుకుంటుంది.

బంగాళాదుంపలను ముక్కలుగా తరిగి వాటిని మిక్సీలో వేసి మెత్తటి పేస్టును పలుచని వస్త్రంలో రసంగా పిండి ముఖాన్ని, మెడ భాగాన్ని బాగా రుద్దుకోవాలి. 

మగ్గిన అరటిపండును తీసుకుని దాన్ని సన్నటి ముక్కలుగా తరిగి ఒక్కొక్క టీస్పూన్‌ చొప్పున రోజ్‌ వాటర్‌, తేనె, పెరుగు వేసి ఆ మిశ్రమాన్ని రాసుకుని 20నిమిషాలు ఉంచుకోవాలి.  

గుడ్డులోని తెల్లసొనలో కొంచెం పాలపై ఉండే మీగడ, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి.