వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త బగ్.

వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌ను క్రాష్ చేస్తున్న బగ్.

యూజర్లు నిర్దిష్ట లింక్ (wa.me/settings)ని కలిగిన..

వ్యక్తిగత లేదా గ్రూపు చాట్‌ను ఓపెన్ చేసినప్పుడు బగ్ సమస్య ఎదురువుతుంది. 

వాట్సాప్ బిజినెస్‌తో సహా పర్సనల్, గ్రూపు చాట్‌లను ప్రభావితం చేసిన బగ్. 

ఈ సమస్యాత్మక లింక్‌తో చాట్‌ను ఓపెన్ చేయగానే క్రాష్‌కు కారణమవుతుంది.

నిర్దిష్ట మెసేజ్ థ్రెడ్‌ని మళ్లీ విజిట్ చేయకపోతే మాత్రం వాట్సాప్ సాధారణంగా రీస్టార్ట్ అవుతుంది. 

ఆండ్రాయిడ్ (WhatsApp 2.23.10.77) వెర్షన్‌ను ప్రభావితం చేస్తున్న బగ్.

వాట్సాప్ బగ్‌ని ఎలా ఫిక్స్ చేయాలంటే..

వాట్సాప్ బ్రౌజర్ వెర్షన్ వాట్సాప్ వెబ్ ఈ బగ్ వల్ల ప్రభావితం కాలేదని తెలుస్తోంది.

అందువల్ల, మీరు మీ బ్రౌజర్ ద్వారా (WhatsApp Web)కి లాగిన్ చేసి.. 

క్రాష్‌ అయ్యే మెసేజ్ లేదా చాట్‌ను డిలీట్ చేయొచ్చు. 

ఆ తర్వాత, మీరు మళ్లీ అదే సమస్యాత్మక లింక్‌ను చూస్తే తప్ప మీ ఫోన్‌లోని మీ వాట్సాప్ క్రాష్ కాదు.