వరుస యాడ్స్ తో హోరెత్తిస్తున్న ఐకాన్ స్టార్

గతంలోనే అల్లు అర్జున్ చాలా యాడ్స్ లో కనిపించాడు. ఇక 'పుష్ప' సినిమా రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ కోసం పెద్ద పెద్ద బ్రాండ్ ఉన్న కంపెనీలు క్యూ కడుతున్నాయి.

గతంలో చాలా యాడ్స్ చేసిన అల్లు అర్జున్ ఇటీవల ర్యాపిడో,  అభి బస్, జొమాటో, ఆహా, శ్రీ చైతన్య కాలేజీల యాడ్స్ లో అలరించి ఇప్పుడు మరిన్ని యాడ్స్ తో రాబోతున్నాడు.

ఇటీవల కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ప్రచారకర్తగా లాంచింగ్స్ కి వెళ్తున్నాడు బన్నీ

ఇటీవలే అల్లు అర్జున్ కోకాకోలా బ్రాండ్ కోసం ఓ స్పెషల్ సాంగ్ యాడ్ చేశాడు

ఆస్ట్రల్ పైప్స్ యాడ్ కోసం మరింత మాస్ గా తయారయి యాడ్ చేశాడు బన్నీ

తాజాగా KFC  యాడ్ తో పలకరిస్తున్నాడు  అల్లు అర్జున్

ఇవే కాక మరిన్ని యాడ్స్ బన్నీకోసం క్యూ కడుతున్నాయి అని టాక్. పుష్ప సినిమాతో ఇండియా అంతటా క్రేజ్ సాధించిన బన్నీ వరుసగా యాడ్స్ ఒప్పుకుంటూ మరింతగా జనాల్లోకి వెళ్తున్నాడు.