బాదంతో.. అధిక బరువుకు చెక్

ఆహారంలో బాదం పప్పు చేర్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చు.

బాదం పప్పులో మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఇ, ప్రొటీన్, ఫైబర్ పుష్కలం.

జీర్ణక్రియకు సాయపడుతుంది. 

చర్మం, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడం ద్వారా ఆకలిని తగ్గిస్తుంది. 

బాదంపప్పును కూడా ఒక కచ్చితమైన బరువు తగ్గించే ఆహారంగా పరిగణిస్తారు. 

ప్రతిరోజు బాదంపప్పు తినడం వల్ల ఎక్కువ బరువు తగ్గవచ్చు.

బరువు తగ్గించే ప్లాన్ లో ఉన్నవారు ఎక్కువ తినకుండా చూస్తుంది. 

బాదంపప్పులో ప్రోటీన్లు, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు.

అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్ తినకుండా ఆపుతుంది.

బాదం.. పొట్టలోని కొవ్వును తగ్గిస్తుంది.

బాడీ మాస్ ఇండెక్స్‌ నిర్వహణలో సాయపడుతుంది. 

పొట్ట పెరుగుతోందని ఆందోళన చెందుతుంటే బాదం పప్పు తీసుకోవటం మంచిది. 

పచ్చి బాదంపప్పు తిన్నప్పుడు జీర్ణ సమస్యలు రావచ్చు. 

నానబెట్టిన బాదం పప్పు తీసుకోవటం మంచిది.

బాదం పప్పును తినటం వల్ల పొట్ట వద్ద ఉన్న కొవ్వులు కరుగుతాయి.