అల్జీమర్స్‌తో బాధపడే వారిని శారీరకంగా వివిధ కార్యక్రమాలతో యాక్టివ్‌గా ఉంచడం ద్వారా..

మెదడును ఆరోగ్యవంతం చేసి మతిమరుపు ముప్పును తగ్గించవచ్చు.

మెదడుకు మేత పెట్టే చిక్కు సమస్యలను పరిష్కరించటం, పదకేళీలు పూరించటం, చదరంగం ఆడటం వంటివి చేయాలి. 

మెదడులోని కణాలు చురుకుగా ఉండేలా చేస్తున్న కొద్దీ ఆరోగ్యకరమైన కణాలు సజీవంగా ఉంటాయి.

రోజూ ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

వారానికి కనీసం మూడు సార్లయినా తాజా పండ్లు తినాలి. 

వీటిల్లోని ఫాలీఫెనాల్స్‌కు అల్జీమర్స్‌ను నివారించే సామర్థ్యముంది.

నిద్ర అలవాట్లు మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.

అందువల్ల నిద్ర సరిగా పట్టేలా చూసుకుంటే..

అల్జీమర్స్‌ను నివారించుకునే అవకాశమూ ఉందని నిపుణులు సూచిస్తున్నారు.