వేప నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. 

ఇవి చర్మంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడతాయి.

వేప నీటితో రోజూ ఫేస్ క్లీన్ చేస్తే..

చర్మ అలర్జీలు, దద్దుర్లు, దురదలు మొదలైన సమస్యల నుంచి బయటపడొచ్చు.

మొటిమలకి చెక్. వేప నీటితో ముఖం కడుక్కోవడం వల్ల మొటిమలు తొలిగిపోతాయి.

ఇది చర్మంపై ఉండే మురికిని, జిడ్డుని శుభ్రపరచడంలో సాయపడుతుంది.

మొటిమల మంటను కూడా తగ్గిస్తుంది.

వేపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, క్రిమినాశక లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో సాయపడతాయి.

ఇది చర్మంలో ఉండే అదనపు నూనెను నియంత్రిస్తుంది.

చర్మాన్ని మృదువుగా చేస్తుంది. వేప నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల స్కిన్ టన్ మెరుగవుతుంది.