జాజికాయలను పురాతన కాలం నుంచి పలు వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. జాజికాయలతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి.

జాజికాయల వల్ల వంటకు ఘుమఘుమలే కాదు..అనేక ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి..

జాజికాయతో జలుబు, దగ్గు,గొంతు నొప్పి మాయం అవుతాయి..

జాజికాయ పొడిని సూప్‌లలో వేసి తీసుకుంటే విరేచనాలు, మలబద్దకం, గ్యాస్‌ తదితర జీర్ణసమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.

జాజికాయల పొడిని నిత్యం తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల దంత సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.

నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పూట భోజనంతో జాజికాయ పొడి తీసుకుంటే రోజూ రాత్రి చక్కగా నిద్ర పడుతుంది.

జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

జాజికాయ పొడిలో కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే రక్త సరఫరా మెరుగు పడుతుంది.

లివర్‌, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.