అందాల ప్రకృతిలో ఎన్నో వింతలు..ఎన్నెన్నో విచిత్రాలు..అటువంటి వింతల్లో కొన్ని అందాల పువ్వులను వీక్షిద్దాం..
వింత ఆకారాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ కుసుమాలు..ఆనందాన్ని కలిగిస్తాయి..
ఇది పువ్వా?! ఎగిరే పక్షా?! అనిపించే అందం..అద్భుతం ఈ సుమం సొంతం..
పువ్వులోంచి మంచు బిందువు..దాంట్లో కనిపించే రంగుల వర్ణాలు వాహ్..ఏమి ఈ సుమం సొగసు..!
దేవదూతల్లాంటి చిన్నారులు..తెల్లటి గౌనులతో డ్యాన్స్ వేస్తున్నట్లుగా ఉన్న ఈ పుష్పాల అందం గురించి ఎంత చెప్పినా తక్కువే..
వావ్..! ధవరణ వర్ణపు చిలకమ్మలు..ఎర్రటి బుట్టబొమ్మల్లా వచ్చి ఊయలూగుతున్నాయా?!
సాక్షాత్తు దేవదూత ప్రకృతి విహారానికి వచ్చి ఇలా సుమ సింహాసనంపై కూర్చుందా ఏమి..!
బుజ్జి బుజ్జి అందాల సుమబాల అంటే ఈ కుసుమమే కావచ్చు సుమా..!!
వారెవ్వా..కోతి బావలు ఇలా పవ్వుల్లో ఒదిగిపోయారా?!
హృదయాలను తీసి తోరణంగా కట్టేసిందా ప్రకృతి? ఈ పువ్వుల అందాలు గురించి ఏమని చెప్పాలి..
ఇంద్రధనుస్సులోని రంగుల్ని పులుముకుని విరబూసిందా ఈ పుష్పం..!
రెండు గండు చీమలు
మొక్క మీద సయ్యాటలు ఆడుతున్నట్లుగా ఉన్నాయి కదూ ఈ అందాల పువ్వులు..
రెండు చిట్టి పిట్టలు ముద్దు పెట్టుకున్నట్లుగా ఉన్న ఈ సుమధుర అందాలు ప్రకృతి చిత్రాలు..
ఈ ప్రకృతి ఒడిలో..ఇంకా ఇటువంటి వింతలు..విచిత్రాలు ఎన్నో..ఎన్నెన్నో