కళ్లకు కనువిందు చేసే..  తామర పువ్వులు..

చూడగానే ఒలుచుకుని తినాలనిపించే తామర కాయలు..

అటువంటి కాయ గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలుసా..?

తామర కాయల్లో ఉండి గింజల్లో సోడియం,మెగ్నీషియం,యాంటీ ఆక్సిడెంట్లుగా పిలిచే ఫ్లెవనాయిడ్లు చాలా ఎక్కువగా ఉంటాయి.

తామర గింజిలు తింటే ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది అని చెప్పవచ్చంటారు న్యూట్రిషనిస్ట్‌లు

తామర గింజల్ని ఫాక్స్‌ నట్‌, గొర్గాన్‌ నట్‌, మఖానా, ఫూల్‌ మఖానా.. ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు.

తామర గింజలలో ఔషధ గుణాలు అపారమని చెబుతున్నారు నిపుణులు.

తక్కువ సోడియం, ఎక్కువ మెగ్నీషియం ఉండటం వల్ల గుండె రోగాలు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయంతో బాధపడేవారికి ఉపయోగకరం..

 తామర గింజలు మధుమేహ రోగులకు ప్రయోజనకరం. మూత్రపిండాలకు చాలా మంచిది.

రోజుకు 25 గ్రాముల తామర గింజలు తీసుకుంటే ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటున్నట్లే..

నిద్రలేమి, గుండెదడ, చికాకు తదితర సమస్యలను తామర గింజలు తగ్గిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది...ఈ గింజలను పచ్చిగా కానీ, వేయించి కానీ తినొచ్చు.

పొడిగా, టానిక్‌లా, పేస్టులా వాడుకోవచ్చు... పాప్‌కార్న్‌ కంటే తామర గింజలు శ్రేష్ఠమైనవి..

పప్పులు, సోయాబీన్‌, సజ్జ, జొన్న మొదలైన వాటితో తామర గింజలను మిశ్రమం చేస్తే పోషకాల విలువ మరింత పెరుగుతుంది.