ఉత్తరేణి మొక్క ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది.. ఉత్తరేణిని సంస్కృతంలో అపామార్గ , ఖరమంజరి అంటారు.

వినాయక చవితికి బొజ్జ గణపయ్యకు సమర్పించే పత్రాల్లో ఒకటి ఉత్తరేణి…

ఉత్తరేణి పూజకు కాదు ఆయుర్వేద వైద్యంలో కూడా విశిష్ట స్థానం ఉంది..ఉత్తరేణిలోని కాండం, ఆకులు, విత్తనాలు అన్నీ వ్యాధులకు నివారణకోసం ఉపయోగపడతాయి..

ఉత్తరేణి కషాయం,లేదా రసం కిడ్నీలను శుభ్రం చేస్తుంది.. మూత్రం ఈజీగా అయ్యేలా చేస్తుంది.

ఉత్తరేణి రసం కఫము , శరీర ఉబ్బు , నొప్పులు, గజ్జి , కుష్టును నివారిస్తుంది..

ఉత్తరేణి విత్తనాలను పాలతో వండుకుని తింటే ఆహారం తర్వాత వచ్చే కడుపు నొప్పిని నివారిస్తుంది.

ఉత్తరేణి  భస్మం అజీర్ణ సమస్యలకు  మంచి ఔషధం..

ఉత్తరేణి విత్తనాల చూర్ణాన్ని నీళ్లతో కలిపి తాగితే..  పిచ్చి కుక్క కరవడం వలన వచ్చే హైడ్రోఫోబియా తగ్గుతుంది..

తేలు, జెర్రి, పాము వంటి విష జంతువులు కరచినప్పుడు కరిచిన ప్లేస్ లో ఉత్తరేణి ఆకులు కాని, వెన్నులు కాని నూరి కరిచిన చోట దళసరిగా పట్టించిన బాధ , మంట తగ్గుతుంది. విషయం హరిస్తుంది..

ఉబ్బసంతో బాధపడేవారు ఈ మొక్క సమూల (వేరు)భస్మం ఒక గ్రాము తేనెలో కలిపి తీసుకుంటే తగ్గుతుంది..

ఉత్తరేణి రసంలో దూది తడిపి పుప్పి పంటిలో పెడితే..పుప్పిపంటి నొప్పి తగ్గుతుంది..

ఉత్తరేణి ఆకురసంలో ముల్లంగి గింజలు కలిపి నూరి సొరియాసిస్ మచ్చలు పైన రాసిన మచ్చలు తగ్గిపోతాయి..40 రోజుల్లో సోరియాసిస్ మచ్చలు తగ్గుతాయి.