గుమ్మ‌డి విత్త‌నాల్లో పోష‌కాలు, యాంటీ అక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి.

వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

ఫాస్ప‌ర‌స్‌, మెగ్నీషియం, ఐర‌న్‌, పోటాషియం, కాప‌ర్, జింక్ స‌హా ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులున్నాయి.

చెక్క‌ర స్థాయుల‌ను అదుపులో ఉంచి, టైప్‌2 డ‌యాబెటిస్ రాకుండా కాపాడ‌తాయి. 

నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌ప్పుడు నాలుగైదు గుమ్మ‌డి విత్త‌నాలు తింటే చాలు.

విత్త‌నాల‌ను కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండిన భావ‌న క‌లుగుతుంది. 

విత్త‌నాల్లోని పీచు జీర్ణ‌శ‌క్తిని మెర‌గుప‌రిచి వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది.

రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేలా చేస్తుంది.

గాయాలు త్వ‌ర‌గా న‌య‌మ‌వ‌డానికి సాయ‌ప‌డ‌తాయి. 

రోజూ ఉద‌యం అల్పాహారంతో పాటు 10 గింజ‌లు తీసుకుంటే మంచిది.

భోజ‌నాల మ‌ధ్య‌లో స‌లాడ్‌లో క‌లిపి తీసుకున్నామంచిది.