చర్మ సౌందర్యానికి సైతం పాలు ఎంతగానో ఉపయోగపడతాయి

దుమ్ము, ధూళీ ప్రభావం పడినప్పుడు చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది

అలాంట‌ప్పుడు పాలను సహజ క్లెన్సర్‌లా ఉపయోగించవచ్చు

పాలు మూసుకుపోయిన చర్మ రంధ్రాలను శుభ్రపర్చుతాయి

పచ్చి పాలను ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచాలి

తరువాత బయటకు తీసి దానికి చెంచా శ‌నగపిండి కలపాలి

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి చేతి వేళ్లతో మృదువుగా  మర్దన చేయాలి

ఇలా చేయటం వల్ల చర్మపైన ఉన్న మురికి తొలగిపోతుంది.

పచ్చి పాలు, తేనె మిశ్రమాన్ని రోజూ ఒంటికి రాసుకోవాలి

ఆపై 20 నిమిషాల తరువాత స్నానం చేస్తే చర్మం మంచి రంగులోకి వస్తుంది