పాలరాయిని పరచినట్లుగా ధవళ వర్ణంతో కళ్లు తిప్పుకోనివ్వని అత్యంత అందమై ప్రదేశం ‘పాముక్కాలె’..

ప్రకృతి వింతల్లో అత్యంత సుందరమైన ప్రదేశం ఈ ‘పాముక్కాలె’..

టర్కీలోని సహజ సిద్ధంగా ఏర్పడిన కొలనులు‘పాముక్కాలె’. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు. 

పాముక్కాలే అంటే... కాటన్ ప్యాలెస్ అని అర్థం...

చరిత్రలో ఈ అందాల ప్రాంతం చుట్టూ ఓ గొప్ప నగరాన్ని నిర్మించారు. కానీ అది కాలక్రమేణ శిథిలమైపోయింది.

కానీ..ప్రకృతి వింత మాత్రం సజీవంగానే ఉండి పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది..

పాలరాయి మధ్యలో ఆకాశం దిగి వచ్చి అక్కడే కొలువైందా? అన్నట్లుగా ఉండే ‘పాముక్కాలె’ అందాలు చూసి తీరవలసిందే..

సహజసిద్ధంగా ఊరే జలం..ఇక్కడి ట్రావెర్టైన్ టెర్రేస్‌లపై నుంచీ... జాలువారుతూ ఉంటుంది.

ఈ గోరువెచ్చటి నీటిలో... జలకాలాడుతూ... మైమరచిపోతారు పర్యాటకులు..

అందాన్ని ఆస్వాదిస్తూ ఆనందంలో మునిగిపోతారు..సూర్యకిరణాలు పడి పసిడివర్ణంలో మెరిసిపోయే ఆ అందాలను చూసి తీరాల్సిందే..

టర్కీకి వెళ్లే పర్యాటకులు ఈ అందాల ప్రదేశాన్ని చూడకుండా రారు..మరి మీరు టర్కీ వెళితే ‘పాముక్కాలె’..అందాలను ఆస్వాదించండి..