ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే దీన్ని ఆరోగ్యలను ఇచ్చే సిరి అంటారు. చలికాలంలో వచ్చే వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది ఉసిరి..

ఉసిరిలో పాలీఫెనాల్స్, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

ఉసిరి వైరస్‌లు, బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటూ ఉసిరి తినాల్సిందే..రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా ఉసిరి శరీరాన్ని అనేక రకాల వైరస్సుల నుంచి రక్షిస్తుంది.

ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. గుండె కండరాలను బలపరుస్తుంది, రక్త ప్రసరణను పెంచుతుంది నాళాలలో అడ్డంకిని తొలగిస్తుంది.

గుండె జబ్బులున్నవారు  ఉసిరిని తమ  ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఉసిరిలో క్రోమియం అనే మూలకం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

మధుమేహ రోగులు ప్రతిరోజు ఉసిరికాయ తింటే చాలా చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు..

ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.

ఉసిరిని పొడిగా,  క్యాప్సూల్స్‌గా,  జామ్, జ్యూస్  లేదా ఎలాగైనా తినవచ్చు.