సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన కొందరు బుల్లితెర యాంకర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

‘బబర్దస్త్ కామెడీ షో’కు యాంకర్‌గా ఉన్న అనసూయ,  రంగస్థలం వంటి పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.

‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ కామెడీ షోలో యాంకర్‌గా ఉన్న రష్మీ,  గుంటూరు టాకీస్ వంటి పలు హిట్ సినిమాల్లో కనిపించింది.

ఎన్నో షోలకు యాంకర్‌గా చేసిన ఉదయభాను కూడా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

తెలుగు మేల్ యాంకర్స్‌లో టాప్ యాంకర్‌గా ఉన్న ప్రదీప్ మాచిరాజు, ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే సినిమాతో హీరోగా మారాడు.

ఈటీవీలో పలు షోల్లో యాంకర్‌గా ఉన్న సుడిగాలి సుధీర్,  ‘3 మంకీస్’, ‘గాలోడు’ వంటి సినిమాల్లో హీరోగా చేశాడు.

మెగా డాటర్ నిహారికా కూడా బుల్లితెరపై ‘ఢీ జూనియర్స్’ షోకు యాంకర్‌గా చేసి, వెండితెరపై హీరోయిన్‌గా మారింది.

‘కలర్స్’ ప్రోగ్రాంతో తన పేరునే కలర్స్ స్వాతిగా మార్చుకుని, ఆ తరువాత పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

స్టార్ యాంకర్ సుమ కనకాల కూడా తాజాగా ‘జయమ్మ పంచాయితీ’ సినిమాతో వెండితెరపై మెరవనుంది!