ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్కల్లో మనీప్లాంట్ కూడా ఒకటి.

ఇంటి అందాన్ని మరింత పెంచుతుందని కొందరు ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటారు.

అదృష్ట మొక్కలుగా భావించే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. 

ధనాన్ని ఆకర్షించేశక్తి ఈ మొక్కకు ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మొక్కను మన ఇంట్లో తూర్పు, ఉత్తరం, దక్షిణ దిక్కులో  ఏర్పాటు చేసుకోవాలి.

ఇంటికి ఆగ్నేయం మూలన పెంచుకోవడం వల్ల కూడా మనకు మేలు కలుగుతుంది.

మొక్కకు ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మంచి పోషణను ఇస్తూ పెంచాలి.

గుబురుగా కాకుండా ఆకాశాన్ని చూస్తూ ఉండేలా తీగలాగా పెంచుకోవాలి.

పండిపోయిన, పసుపు రంగులో మారిన ఆకులను తొలగించాలి.

మన ఇంట్లో పెంచుకునే మనీప్లాంట్ మొక్క ప‌చ్చ‌గా ఉండేలా చూసుకోవాలి.