కొందరు నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు.

గురక పెట్టడం వల్ల పక్కవాళ్లు ఇబ్బంది పడతారు.

నిద్రలో గురక అలవాటు ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఉంటుందట.

మూడింట ఒక వంతు మంది పురుషుల్లో గురకపెట్టే అలవాటు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

గురక తగ్గించుకునేందుకు 'సీపీఏపీ' చికిత్స ఉంది.

కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్ అన్నమాట.

నిద్రించేటప్పుడు ముక్కు, నోరు కవరయ్యేలా ఒక మాస్క్ ధరించాలి.

దీనికి అనుసంధానంగా ఒక మిషన్ ఉంటుంది.

ఇది గురక బాధితుల శ్వాసనాళాలు తెరుచుకునేలా సాయపడుతుంది.

దీంతో శ్వాస తీసుకోవడం తేలికవుతుంది.

చికిత్సలో భాగంగా వైద్యులు నిద్రలో ఉండే వ్యక్తి గుండె, ఊపిరితిత్తుల పనితీరుని ల్యాబ్​లో పరీక్షిస్తారు.

దీని ఆధారంగా వైద్యులు స్లీప్ అప్నియా పరీక్షలు చేస్తారు.

ఈ పరీక్ష.. శ్వాసనాళాల పనితీరును తెలియజేస్తుంది.