ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్లో ర‌విచంద్ర అశ్విన్‌ ఆరుదైన ఘనత సాధించాడు.

టెస్టుల్లో 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

ఆసీస్ ఆటగాడు అలెక్స్‌ క్యారీని ఔట్‌ చేసి అశ్విన్ ఆ ఘనతను సాధించాడు.

450 వికెట్లు తీయడంతో అశ్విన్ పలు రికార్డులు సృష్టించాడు.

టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు సాధించిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు.

88 టెస్టుల్లో అశ్విన్ ఈ ఘనతను సాధించాడు.

అంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది.

కుంబ్లే  93 టెస్టు మ్యాచ్‌ల‌లో 450 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు.

టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా శ్రీలంక మాజీ క్రికెట‌ర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు.

ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ 133 మ్యాచ్‌ల‌లో 800 వికెట్లు తీశాడు. 

టెస్టుల్లో 450 వికెట్ల మైలురాయిని చేరుకున్న 9వ బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.