భోజనం చేశాక కొన్నింటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం వంటి వాటికి చెక్ పెట్టొచ్చు.

భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినొద్దు.

ఇలా తింటే పొట్ట పెరిగే అవకాశం ఉంది.

అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. 

అలా చేస్తే తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృతులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటుంది.

తిన్న వెంటనే స్నానం చేయకూడదు.

ఒకవేళ అలా చేస్తే శరీరంలో రక్త ప్రసరణ తగ్గి.. జీర్ణవ్యవస్థ పనితీరుపై ప్రభావం పడుతుంది.

ముఖ్యంగా తిన్న వెంటనే పడుకోవడం చేయొద్దు.

ఇలా చేస్తే ఆహారం జీర్ణం కాక జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి.

భోజనం చేశాక పొగ తాగడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.