కొంతమంది ఎప్పుడూ ఆందోళనకు గురవుతూ ఉంటారు.
ఆందోళనతో ఏ పని సక్రమంగా చెయ్యిలేక పోతుంటారు. నిద్ర సరిగా పట్టడు. ప్రశాంతంత ఉండదు.
ఆందోళనలు తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలంటే ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు వాడితే ఉపశమనం లభిస్తుంది.
ఆందోళన చెందుతున్న వారు తలకు నూనెను ఎక్కువగా ఉపయోగించాలి.
అశ్వగంధ ఆందోళనను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
బ్రాహ్మి ఆందోళనను తగ్గించే మరో ఔషదం. ఇది శరీరంలోని కార్టిసాల్ (స్ట్రెస్ హర్మోన్) స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
తరచూ ఒంటె భంగిమలో కూర్చోవడంకూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.
మండూకపర్ణి, బ్రహ్మి, అశ్వగంధ, యష్టిమధు, జటామంసి, ఉసిరి వంటి మూలికలు ఆందోళనను తగ్గించి, శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తాయి.
నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉన్నట్లయితే, క్షీరబల తైలంతో పాద మర్దన చేస్తే చక్కగా నిద్రపోతారు.
మానసమిత్రావతకం వంటి మూలికా ఔషధాలు మానసిక ప్రశాంతతను పొందడంలో సహాయపడతాయి.