ప్రతిరోజూ ఒకే వేళకు నిద్ర లేవాలి.
నిద్ర లేచిన వెంటనే ఏడుసార్లు ముఖం మీద నీళ్లు చల్లుకోవాలి.
ఇలా చేయడం వల్ల శరీరంలోని ఏడు చక్రాలు చైతన్యమవుతాయి.
జీర్ణంకాని ఆహార పదార్థాలు, వ్యర్థాలు తొలగిపోవడం కోసం నాలుక గీసుకోవాలి.
శరీరం నుంచి వ్యర్థాలు తొలగిపోవడం కోసం పరగడుపున నోరు పుక్కిలించాలి.
కండరాలు చైతన్యమవడం కోసం నచ్చిన నూనెతో శరీరం మర్దన చేసుకోవాలి.
చర్మ రంథ్రాలు తెరుచుకుని, రక్తప్రసరణ మెరుగవడం కోసం డ్రై స్కిన్ బ్రషింగ్ చేయాలి.
రోజు ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేయాలి.
దైనందిన కార్యకలాపాలు రోజంతా ప్రశాంతంగా సాగుతాయి
స్నానంకోసం శరీర దోషానికి తగిన నీటిని ఎంచుకోవాలి.
పిత్త దోషం ఉన్నవాళ్లు చల్లటి నీళ్ల స్నానం చేయాలి.
వాత దోషం ఉన్నవాళ్లు వేడి నీటితో, కఫ దోషం ఉన్నవాళ్లు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.