దగ్గు సమస్యను తగ్గించుకోవటానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం..
ఖర్జూరం , మిరియాలు, విడంగాలు, పిప్పళ్లు, తేనె సమభాగాలుగా కలిపి తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
టీ స్పూన్ అతి మధుర చూర్ణాన్ని టీస్పూన్ తేనె లేదంటే పంచదారతో కలిపి తింటే కఫం పడిపోయి దగ్గుతగ్గుతుంది.
అరగ్రాము మిరియాల చూర్ణం, నెయ్యి, చక్కెర , తేనె కలిపి తింటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
పిప్పళ్లు, అల్లం, తుంగమస్తలు, పసుపు, కరక్కాయ సమభాగాలుగా తీసుకుని చూర్ణంగా చేయాలి. దానికి తేనె లేదంటే పంచదార కలిపి పేస్టుగా చేసుకుని తీసుకోవాలి. ఇలా చేస్తే దగ్గు తగ్గుతుంది.
పిప్పళ్లు, అల్లం, తుంగమస్తలు, పసుపు, కరక్కాయ సమభాగాలుగా తీసుకుని చూర్ణంగా చేయాలి. దానికి తేనె లేదంటే పంచదార కలిపి పేస్టుగా చేసుకుని తీసుకోవాలి. ఇలా చేస్తే దగ్గు తగ్గుతుంది.
తామరగింజల చూర్ణానికి తేనె కలిపి తీసుకుంటే పైత్య దోషం వల్ల వచ్చిన దగ్గు పోతుంది.
తమలపాకుల రసాన్ని వెడిచేసి చల్లారిన తరువాత దానికి తేనె కలిపి తాగితే గడ్డ కట్టిన కఫం కరిగి దగ్గు తగ్గిపోతుంది.
టేబుల్ స్పూన్ తులసి ఆకుల రసానికి తగినంత తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.
మిరియాల చూర్ణం, నెయ్యి , చక్కెర కలిపి టీ స్పూన్ చొప్పున తింటే దగ్గు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
రెండు చిటికెల లవంగాల చూర్ణం, తేనె, పటిక బెల్లం చూర్ణంలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.