ప్ర‌స‌వ‌మైన వెంట‌నే చిన్నారికి పాలివ్వ‌డ‌మే ముఖ్యంగా త‌ల్లికి క‌నిపిస్తుంది.

 పాపాయి సంర‌క్ష‌ణ‌తో పాటు త‌న ఆరోగ్యాన్ని కూడా సంర‌క్షించుకుంటేనే ఇరువురికి మేలు. 

త‌ల్లైన త‌ర్వాత జంక్ ఫుడ్‌ను వ‌దిలి పోష‌కాహారాన్ని తీసుకోవాలి. 

గింజ‌ధాన్యాలు, ప్రొటీన్లు ఉండే మాంసాహారం, తాజా కూర‌గాయ‌లు, ముదురు వ‌ర్ణం పండ్లు ప్ర‌తీరోజూ తీసుకోవాలి. 

చిక్కుడుజాతి కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు శ‌రీరానికి కావాల్సిన విట‌మిన్ల‌ను అందిస్తాయి. 

చిన్నారికి పాలిచ్చే స‌మ‌యంలో ఎక్కువ‌గా దాహం వేస్తుంటుంది. 

 పండ్ల ర‌సాలు, మంచినీళ్లు వంటివి త‌ర‌చూ తీసుకుంటే శ‌రీరం డీహైడ్రేష‌న్ కాకుండా ఉంటుంది. 

రోజులో క‌నీసం అయిదారు సార్లు మంచి ఆహారం తీసుకోవాలి. 

మ‌సాలా ఎక్కువ‌గా లేని ఆహారాన్ని తీసుకోవాలి. 

టీ, కాఫీ, శీత‌ల పానీయాలు వంటివాటికి దూరంగా ఉండాలి.