అన్‌స్టాపబుల్‌-2 షోలో బాలకృష్ణ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

 చంద్రబాబుకి బాలయ్య గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

సీనియర్ ఎన్టీఆర్‌ని చంద్రబాబు మొదటిసారి ఎప్పుడు? ఎక్కడ? ఎలా కలిశారో చెప్పారు.

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో హైదరాబాద్‌లో చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి చర్చించారు.

జగన్ ప్రభుత్వం పనితీరుపై అన్‌స్టాపబుల్‌-2 షోలో చంద్రబాబు ప్రస్తావించారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని తీసేసి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై షోలో బాలకృష్ణ, చంద్రబాబు స్పందించారు.

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేలా ఎలా ఒప్పించారో చంద్రబాబు తెలిపారు.

బాలకృష్ణ బసవతారకం ట్రస్ట్, ఆస్పత్రిని, భువనేశ్వరి ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్‌ని బాగా నడిపిస్తున్నారంటూ చంద్రబాబు అభినందించారు. 

వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో తనకున్న స్నేహం గురించి చంద్రబాబు షోలో వివరించారు. 

కాలేజీ చదువుల సమయంలో చేసిన అల్లరి పనులను చంద్రబాబు  గుర్తుచేసుకున్నారు. 

మొదటిసారి ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో చంద్రబాబు చెప్పారు. 

దేశ రాజకీయాల గురించికూడా చంద్రబాబు ఈ షోలో ప్రస్తావించారు.

వివాదాస్పద అంశం అయిన ఎన్టీఆర్ ఇష్యూ గురించి చంద్రబాబు చాలా సంవత్సరాల తర్వాత ఈ ఎపిసోడ్‌లో మాట్లాడారు.

కోడలు బ్రాహ్మణి, తన భార్య భువనేశ్వరి గురించి గొప్పగా చెప్పారు 

లోకేష్, బ్రాహ్మణి వివాహం గురించి మాట్లాడారు.

లోకేష్‌పై వచ్చే ట్రోల్స్ గురించి చంద్రబాబు స్పందించారు.

అలిపిరిలో జరిగిన బాంబు బ్లాస్ట్ గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు.

2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోవటానికి కారణాల గురించి లోకేష్‌ను బాలకృష్ణ ప్రశ్నించారు.