బప్పీ లహరి పశ్చిమ బెంగాల్ లో 1952 నవంబర్ 27న జన్మించారు

1973లో హిందీ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు

హిందీలో దాదాపు 100 సినిమాలకి పైగా, తెలుగులో 25 సినిమాలకి పైగా సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు.  తమిళ్, కన్నడ, గుజరాతి, బెంగాలీ.. మరి కొన్ని భాషల్లో కూడా సంగీతం అందించారు

దాదాపు అన్ని భాషల్లోనూ కలిపి 5000కు పైగా పాటలు పాడారు

తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో పాటు మరి కొంతమంది హీరోలకి మంచి ఆల్బమ్స్ అందించారు

తెలుగులో చివరగా రవితేజ 'డిస్కోరాజా' సినిమాలో టైటిల్ సాంగ్ ని పాడారు

ఒంటి మీద ఎప్పుడూ ఎక్కువగా బంగారం ధరించి అందరికంటే ప్రత్యేకంగా కనపడేవారు

బీజేపీలో జాయిన్ అయి రాజకీయాల్లో కూడా తన వంతు పాత్ర పోషించారు

15 ఫిబ్రవరి 2022న అనారోగ్యంతో చికిత్స పొందుతూ హాస్పిటల్ లోనే మరణించారు