బరువును తగ్గించే బార్లీ వాటర్

బార్లీ లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది. 

వోట్స్‌కు బదులుగా బార్లీని అల్పాహారము, గంజి రూపంలో తీసుకోవచ్చు. 

స్త్రీలు మూత్ర ఇన్‌ఫెక్షన్స్ అదుపులో ఉంచేందుకు ఉదయము పూట ఒక గ్లాస్ బార్లీ నీళ్ళు తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది.

కొవ్వు, కొలెస్ట్రాల్, చక్కెర శాతం తక్కువ. ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గటానికి పోషకాహారంగా సూచిస్తున్నారు.

జీవక్రియను వేగవంతం చేయటంలో తోడ్పడటం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. 

క్రమం తప్పకుండా బార్లీ నీటిని తాగటం వల్ల ఊబకాయం తగ్గుతుంది. 

బార్లీలో ఉండే పెక్టిన్ రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. 

నిమ్మకాయ, తేనెతో కలిపి బార్లీ నీటిని తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది

రోజూ బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గిపోతుంది.