వేసవిలో బార్లీ నీరు తాగటం ఎంతో మంచిది. బార్లీ గింజలు వేసవిలో సహజసిద్ధమైన ఔషధంలా పనిచేస్తాయి.
శరీరంలోని వేడిని తగ్గించి, తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బార్లీ నీళ్లు తాగితే జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది.
బార్లీ నీటిని తాగితే శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. మూత్రాశయం శుభ్రంగా మారుతుంది.
క్యాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్, రాగి.. వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు బార్లీ నీటి ద్వారా శరీరానికి అందుతాయి.
పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు.
వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఈ నీళ్లు తాగించటం మంచిది. హృద్రోగాలను దరి చేరనివ్వవు.
బార్లీ నీళ్లు అధిక బరువును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు.. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
బార్లీ శరీరంలో అధిక నీటిని తొలగిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది.
బార్లీ నీటికి మజ్జిగ, నిమ్మరసం, తేనె, నారింజ రసాన్ని కలుపుకొని తాగితే రుచితోపాటు శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.