ఈరోజుల్లో సామాజిక మాధ్యమాలు దాదాపు అందరి జీవితం, ఉద్యోగం, అనుబంధాల్లో భాగమైపోయాయి. సోషల్ మీడియా పరిచయంతో జీవితభాగస్వామిని వెతుక్కున్న వారున్నారు. అదే మీడియా సాక్షిగా విడిపోయిన జంటలూ ఉన్నాయి. ప్రేమ పక్షుల మధ్య చిన్న చిన్న తగవులకు చాలా వరకు సామాజిక మాధ్యమాలు కూడా ఒక కారణం. అనుబంధాలపై సోషల్ మీడియా చూపే ప్రతికూల ప్రభావాలేంటో చూద్దాం...