అందమైన ఆర్కిడ్ ఫ్లవర్స్ చూస్తే చూపు తిప్పుకోలేం. అంతటి అందమైన పువ్వు అదృష్టాన్ని తెస్తుంది అంటే ఎవరైనా వదులుతారా చెప్పండి..మరి అదృష్టాన్ని తెచ్చే ఆర్కిడ్ ఫ్లవర్స్ గురించి విశేషాలు తెలుసుకుందాం రండీ..

ఈ పువ్వులు జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందాయి.. వీటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ పువ్వులు ఇంట్లో అలంకరించుకుంటే అందమే కాదు అదృష్టాన్ని కూడా తెస్తాయట..!

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్ వింగ్ కొత్త ఆర్చిడ్ సెఫలాంతెరా ఎరెక్టా వర్‌ను కనుగొన్నారు.

1870 మీటర్ల ఎత్తులో కనుగొనబడిన ఈ జాతి ఇంతకు ముందు భారతదేశంలో కనిపించలేదు.

ఈ జాతి ఆర్కిడ్ ఇతర దేశాలలో కూడా ఉందట. ఉత్తరాఖండ్‌లోని మండల్ లోయలో 67 కంటే ఎక్కువ రకాల ఆర్కిడ్‌లు ఉన్నాయి.ఇది ఉత్తరాఖండ్‌లో ఉన్న ఆర్కిడ్‌లలో 30 శాతం.

ఉత్తరాఖండ్‌లో 25,000 – 30,000 వివిధ రకాల ఆర్కిడ్‌లు ఉన్నాయి.

వీటిలో కొన్ని ఆర్కిడ్‌ల యొక్క ప్రసిద్ధ జాతులు, వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు..సాగు చేస్తారు.

చమోలి జిల్లాలోని మండల ప్రాంతంలో ఉత్తరాఖండ్ అటవీ శాఖ రీసెర్చ్ వింగ్ ద్వారా ఇటీవల ఆర్కిడ్ పరిరక్షణ కేంద్రం కూడా స్థాపించబడింది. ఇక్కడ 70 రకాల ఆర్కిడ్‌లు భద్రపరిచారు.

ఆర్కిడ్ పువ్వులు అనేక జాతులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. ఈ పువ్వులు రంగు మరియు పరిమాణంలో మారుతూ ఉంటాయి.

ఆర్కిడ్ పువ్వులను పండించే రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. పూల మార్కెట్ లో ఆర్కిడ్ పువ్వుల  కొమ్మలకు మంచి ధర పలుకుతుంది..