ఆవుపేడతో తయారైన రాఖీలు..

ఆవుపేడతో తయారైన రాఖీలకు పెరుగుతున్న గిరాకీ..

జైపూర్ నుంచి 60,000కు పైగా విదేశాలకు ఎగుమతి అయిన ఆవుపేడ రాఖీలు..

40,000 రాఖీలు అమెరికాకు ..మరో 20,000 రాఖీలు మారిషస్‌కు ఎగుమతి..

ఆవుపేడతోపాటు, విత్తనాలతో తయారైన హెర్బల్ రాఖీలను విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్న ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ

అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులను గోవుల సంరక్షణకు వినియోగిస్తున్న సంస్థ..

ఆవుపేడతో రాఖీల తయారీతో అభివృద్ధి చెందుతున్నసహాయక మహిళా సంఘాలు

చైనా రాఖీలకు బదులు దేశీయ రాఖీలు వాడేందుకు ఎందరో ఆసక్తి చూపుతున్న వినియోగదారులు..

ఆవుపేడ రాఖీలు రేడియేషన్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని చెబుతున్న ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ సంస్థ