మీ ముఖంపై మచ్చలు, మెటిమలు ఉన్నాయా?

అయితే ఔషదగుణాలున్న పుదీనా ఫేస్ ప్యాక్స్ తో పెట్టండీ..చెక్..

వంటకాల్లోనే కాదు కాస్మెటిక్స్ లో కూడా పుదీనా ఉపయోగం..

పుదీనాలో.. కార్మినేటివ్, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది.

పుదీనాలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు చర్మంపై మొటిమలు , మచ్చలు తొలగించటంలో సహాయపడతాయి. చర్మం కాంతి వంతంగా మారుతుంది.

పుదీనాలో ఉండే సలిసిలిక్ ఆమ్లం చర్మం లోపలి మలినాలను తొలగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది.

పుదీనా,తేనె ఫేస్ ఫ్యాక్: గుప్పెడు తాజా పుదీనా ఆకులు, కొద్దిగా నీరు, ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి మెత్తగా పేస్ట్ లా చేసి ముఖంపై మాస్క్ లా వేసుకోవాలి. అరగంట ఉంచిచల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

పుదీనా, పెరుగు ఫేస్ ప్యాక్ : గుప్పెడు పొదీనా ఆకులు,టేబుల్ స్పూన్ పెరుగును చేపేస్ట్ గా చేసుకోవాలి. పేస్ట్ ముఖానికి అప్లై చేయాలి. 

పుదీనా, నిమ్మరసం ఫేస్ ప్యాక్ :  పుదీనా ఆకులు,టేబుల్ స్పూన్ నిమ్మరసంతో పేస్ట్ చేయాలి.పేస్ట్ ను ముఖంతోపాటు, మెడబాగాల్లో అప్లై చేయాలి..

పుదీనా, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :పుదీనా ఆకులు, కొంచెం రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి ముఖంపై అప్లై చేయాలి.

ఈ పుదీనా ఫేస్ ప్యాక్స్ మార్చి మార్చి వారానికి రెండు సార్లు వేసుకుంటే..ముఖం కాంతివంతంగా కళకళలాడుతుంది..