ఏదైనా హద్దు మించితేనే ప్రమాదం కానీ, రోజూ కొంత మోతాదులో మాత్రమే తీసుకుంటే ఇబ్బంది లేదంట. పైగా బీర్‌ను రోజుకు కొంచెంగా తీసుకుంటే పేగులకు మంచి జరుగుతుందట.

పోర్చుగల్ లోని పోర్టో నగరంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ హెల్త్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ నిర్వహించిన స్టడీలో ఇదే విషయం వెల్లడైంది.

బీర్ తాగడం వల్ల పేగుల్లో ఉండే మైక్రోబయోటా అనే మంచి బ్యాక్టీరియా మెరుగుదలకు దోహదం చేస్తుంది. 

ఇది ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల వంటి చాలా సాధారణ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

స్టడీ సమయంలో, 23 నుండి 58 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పురుషులు 4 వారాల పాటు ఆల్కహాల్ ఉన్న బీర్‌ను, ఆల్కహాల్ లేని బీర్‌ను ప్రతిరోజూ 330 మిల్లీలీటర్ల బీర్ తాగారు.

పరిశోధన ద్వారా పొందిన ఫలితాల్లో బీర్ వినియోగం "బరువు, కొవ్వు ద్రవ్యరాశిని పెంచకుండా, ప్రేగు మైక్రోబయోటా అనే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది" అని సూచించింది.

బీర్ తాగడం వల్ల గ్లూకోజ్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి "కార్డియోమెటబాలిక్ బయోమార్కర్స్‌కు పెద్దగా అంతరాయం కలగదు" అని ప్రకటన పేర్కొంది.

జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ఇటీవల ప్రచురించిన అధ్యయనం, గట్ ఆరోగ్యంపై బీర్ వల్ల చేకూరే ప్రయోజనం ఆల్కహాల్ కంటెంట్ తో సంబంధం లేకుండా ఉందని నిరూపితమైంది. 

అలాగే రక్తం, గుండె మరియు జీవక్రియలకు సంబంధించి ఎలాంటి సమస్యా ఉండదని అన్నారు.

బీర్ తాగటం వలన శరీరంలో పాలీఫెనాల్స్ కు చెందిన అనేక సమ్మేళనాలు, కుళ్లిన తర్వాత.. దానిలో ఏర్పడిన సూక్ష్మజీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.