శరీరంలో రక్తాన్ని వృద్ధి చేయటంతోపాటు అనేక అనారోగ్యసమస్యలకు బీట్ రూట్ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A,విటమిన్ B6,ఐరన్ వంటివాటితోపాటు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటివి ఉన్నాయి.

ఈ జ్యూస్‌లో తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు రోజు వారిగా దీనిని తీసుకోవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్ బీటైన్ కాలేయంలోని కొవ్వు నిల్వలను నిరోధించడానికి లేదా తగ్గించడానికి సహాయపడుతుంది.

మద్యం తాగడం వల్ల పాడైపోయే లివర్‌ను కాపాడేందుకు బీట్ రూట్ జ్యూస్ చక్కగా ఉపయోగపడుతుంది. 

బీట్ రూట్ రసంలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వృద్ధులలో మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి.

తీవ్రమైన ఎండ, ఇతరత్ర కాలుష్యాల నుంచీ చర్మాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం.

ఆరోగ్యకరమైన సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.

ఇందులో ఉండే లైకోపీన్ సూర్యుడి తీవ్రమైన ఎండల నుంచీ మన చర్మాన్ని కాపాడుతుంది.

శరీరంలో రక్తాన్ని వృద్ధి చేయటంతోపాటు అనేక అనారోగ్యసమస్యలకు బీట్ రూట్ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది.