కాన్సర్ ట్రీట్మెంట్ కి సంబంధించి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను తగ్గించేందుకు హెల్ప్ చేసే పండ్లను తప్పకుండా తినాలి. ఆ పండ్లు ఏవో తెలుసుకుందాం..
బ్లూబెర్రీస్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్, విటమిన్ సి, మ్యాంగనీజ్ సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. వీటిలో కాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని అనేక అద్యయనాలు వెల్లడించాయి.
మీడియం సైజ్ నారింజలో మన రోజువారీ విటమిన్ సి లభిస్తుంది. ఇమ్యూనిటీను పెంచేందుకు విటమిన్ సి మెయిన్ రోల్ పోషిస్తుంది. విటమిన్ సి వల్ల కాన్సర్ సెల్స్ గ్రోత్ తో పాటు వ్యాప్తి తగ్గుతుంది.నారింజ్ వల్ల కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్ అనీమియా తగ్గుతుంది.
కాన్సర్ నుంచి రికవర్ అవుతున్నవారికి అరటిపండ్లు బాగా హెల్ప్ చేస్తాయి. విటమిన్ బి6, మ్యాంగనీజ్ మరియు విటమిన్ సి లభిస్తాయి. అరటిపండ్లలో పెక్టిన్ అనే ఒక రకమైన ఫైబర్ ఉంటుంది. డయేరియాతో బాధపడుతున్న కాన్సర్ పేషంట్స్ కి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది.
ఆపిల్స్ లో ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ సి లు లభ్యమవుతాయి. ఇవన్నీ కాన్సర్ రికవరీకి హెల్ప్ చేస్తాయి. దీంట్లో ఉండే ఫైబర్ బవుల్ మూవ్మెంట్ ను రెగ్యూలరైజ్ చేస్తుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేసి ఇమ్యూన్ ఫంక్షన్ ను ఇంప్రూవ్ చేసి కాన్సర్ సెల్ గ్రోత్ ను అరికడుతుంది.
నిమ్మకాయలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. టెస్ట్ ట్యూబ్ స్టడీస్ ప్రకారం నిమ్మ సారం వల్ల వివిధ రకాల కాన్సర్ సెల్స్ గ్రోత్ అడ్డుకోబడుతుందట.
దానిమ్మ పండులో విటమిన్ సి,ఫైబర్ తో పాటు విటమిన్ కే, ఫోలేట్,పొటాషియం కూడా లభిస్తాయి. దానిమ్మ పండు వల్ల మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. జాయింట్ పెయిన్ కూడా తగ్గుతుందని చెబుతున్నాయి. ఈ రెండు సమస్యలు కేన్సర్ ట్రీట్మెంట్ కి సంబంధించినసైడ్ ఎఫెక్ట్స్. దానిమ్మతో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కు చెక్ పెట్టవచ్చు.
మల్ బెర్రీస్: కాన్సర్ ను ట్రీట్ చేయడానికి మల్ బెర్రీస్ ను అనేక ట్రెడిషనల్ చికిత్సా విధానాల్లో వాడటం జరుగుతోంది. మల్ బెర్రీస్ లో విటమిన్ సి తో పాటు ఐరన్ ఎక్కువగా ఉంటాయి. న్సర్ చికిత్సలో భాగంగా తలెత్తే అనీమియాను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది ఈ ఫ్రూట్.
స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి, ఫోలేట్, మ్యాంగనీజ్,పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. ఒక స్టడీ ప్రకారం, స్ట్రా బెర్రీ సారం బ్రెస్ట్ కాన్సర్ సెల్స్ ను నిర్మూలిస్తుందని తేలింది. అలాగే, ట్యూమర్ గ్రోత్ ను కూడా అరికడుతుందట.
చెర్రీస్ లో విటమిన్ సి, పొటాషియం, కాపర్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో బీటా కెరోటిన్, ల్యూటీన్ మరియు జియాగ్జాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. చెర్రీస్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ను స్లో చేస్తాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
బ్లాక్ బెర్రీస్ లో విటమిన్ సి, మ్యాంగనీజ్,విటమిన్ కే ఉంటుంది. బ్లాక్ బెర్రీస్ క్యాన్సర్ సెల్స్ వ్యాప్తిని కూడా నిరోధిస్తాయి. ఈ ఫ్రూట్స్ తో కాన్సర్ ట్రీట్మెంట్ సమయంలో అలాగే క్యాన్సర్ నుంచి రికవరీ సమయంలో మంచి బెనిఫిట్ పొందవచ్చు.