పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి.అయితే వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు న్యూజెర్సీకి చెందిన వైద్యులు. పరగడుపున చిన్న వెల్లుల్లి ముక్క తింటే ఆరోగ్యవంతులుగా మారడం ఖాయమంటున్నారు.

వెల్లుల్లిలోని 3 పాయలను పాలలో కలిపి మరగబెట్టి రాత్రి  వేళల్లో సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. 

 ఛాతీకి సంబంధించిన కొన్ని రకాల వ్యాధులను వెల్లుల్లి సమర్ధవంతంగా నివారిస్తుంది. శ్వాసకోశాలకు పట్టిన కొవ్వును కరిగించి శ్వాస సక్రమంగా జరిగేట్లు చేస్తుందిt

రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది, కాలేయము ఆరోగ్యానికి,కీళ్ళనొప్పులు తగ్గడానికి సహాయపడుతుంది

వెల్లుల్లి  నాచురల్‌ యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. అల్పాహారం తినకముందే రెండు వెల్లుల్లిపాయల్ని తింటే.. కడుపులోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. పొద్దున్నే తినడం వల్ల వెల్లుల్లికి ఈ శక్తి ఎక్కువ

జీర్ణకోశ వ్యాధులకు వెల్లుల్లి చక్కటి ఔషదంగా ఉపయోగపడుతుంది. ఇది లింఫ్‌ గ్రంధుల మీద ప్రభావాన్ని చూపి శరీరంలో ఉన్న మలిన పదార్థాలను బయటికి పంపటంలో సహకరిస్తుంది

బీపిని తగ్గించటానికి సమర్థవంతమైన వైద్యంగా వెల్లుల్లి తగ్గిస్తుంది. చిన్న ధమనులు మీద పడే ఒత్తిడిని, టెన్షన్‌నూ వెల్లుల్లి తగ్గిస్తుంది

ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధనలలో వెల్లుల్లి గుండెపోటును సమర్థవంతంగా నివారిస్తుందని వెల్లడించారు

ముఖం , శరీరం వర్చస్సు ఆకర్షణీయంగా ఉండాలంటే రెండు వెల్లుల్లి పాయల రసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి

బరువు తగ్గటానికి, జ్వరాల నుండి త్వరగా కోలుకోవడానికి, జలుబు నుండి బైట పడటానికి వెల్లుల్లిరసం, తేనెల మిశ్రమం దివ్య ఔషధంగా పని చేస్తుంది

వెల్లుల్లి తినడం వల్ల మన రక్తనాళాల్లోని సాగే గుణం పదిలంగా ఉంటుంది. వెల్లుల్లి తిననివారిలో కంటే దాన్ని క్రమం తప్పకుండా తినే వారిలో రక్తనాళాలు సాగే గుణం 72% అధికంగా ఉంటుం