బెండకాయలు గురించి తెలియని వారుండరు. బెండకాయలు ఎక్కువగా తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని, లెక్కలు బాగా వస్తాయని చిన్నప్పుడు చెప్పడం వినే ఉంటాం 

అసలు బెండకాయ అంటేనే పోషకాల గని.  అందులో ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది.  బెండకాయ  తరుచూ తింటే మలబద్ధకం లాంటి సమస్యలు రానేరావు

బెండకాయలను ఇంగ్లీష్‌లో లేడీ ఫింగర్స్‌ అని, ఓక్రా అని కూడా పిలుస్తారు.  లేత బెండకాయలను తెచ్చి వండితే ఎలా చేసినా కూర భలేగా ఉంటుంది

బెండకాయల్లో ఫాస్ఫరస్, విటమిన్‌-ఎ  అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.  మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి

బెండకాయ తింటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ముఖ్యంగా పిల్లలు వీటిని తింటే చదువుల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది

అలాగే బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలూ ఎక్కువే. బెండకాయ తింటే కొలెస్ట్రాల్‌కూడా నియంత్రణలో ఉంటుంది

బెండకాయల్లో ఉండే విటమిన్‌ బి9 ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లను తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.  నిద్ర బాగా పడుతుంది

సాధారణంగా మనం పచ్చ బెండకాయలు చూసి ఉంటాం. ఇప్పుడు మార్కెట్ లోకి ఎర్ర బెండకాయలు కూడా వస్తున్నాయి

ఆకుపచ్చని బెండకాయల కన్నా ఎర్ర బెండకాయలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ బెండకాయలు ఎక్కువగా చలి ఉన్న ప్రాంతాల్లో పండుతాయి

బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా  పనికి రాదనేది సామెత..  కానీ బెండకాయ తినటం వల్ల ఎన్నిప్రయోజనాలు  ఉన్నాయో చూశాం కదా.. మరోసారి ఇంకో  కాయగూరతో మళ్లీ కలుద్దాం