దానిమ్మ పండ్లను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ దానిమ్మ పండ్లను ఆరోగ్యప్రదాయినిగా చెప్పవచ్చు. వీటితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి

దానిమ్మ పండ్లలో పాలిఫినాల్స్‌ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రోజూ ఒక కప్పు దానిమ్మ పండు జ్యూస్‌ను తాగిన వారిలో జ్ఞాపకశక్తి పెరిగిందని సైంటిస్టులు తేల్చారు.కనుక దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చిన్నారులు చదువుల్లో రాణిస్తారు

రోజూ దానిమ్మ పండ్ల జ్యూస్‌ను ఒక కప్పు మోతాదులో తాగితే బీపీ, కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గినట్లు సైంటిస్టులు గుర్తించారు.

క్రమం తప్పకుండా నెల రోజుల పాటు ఈ జ్యూస్‌ను రోజూ తాగితే కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు పూర్తిగా పోతాయి.

దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడి బీపీ తగ్గుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.

దానిమ్మ పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది

క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకునే గుణాలు  దానిమ్మ పండ్లలో ఉన్నాయి. కనుక క్యాన్సర్‌ రాకుండా చూసుకోవచ్చు

దానిమ్మ పండ్లలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కనుక జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఈ జ్యూస్‌ను రోజూ తాగితే ప్రయోజనం ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గిపోతాయి

దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి  శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.  ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.  అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడతాయి.  మొటిమల సమస్య ఉన్నవారు రోజూ ఈ పండ్ల  జ్యూస్‌ను తాగితే ప్రయోజనం కలుగుతుంది

ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండే  దానిమ్మలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలుఉంటాయి.  రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన అనంతరం ఒక కప్పు  దానిమ్మ పండు జ్యూస్‌ను తాగడం వల్ల ఎన్నో  లాభాలను పొందవచ్చు.  లేదా రోజుకు ఒక దానిమ్మ పండును అయినా సరే తినాలి.  దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి