గుమ్మడికాయ‌ గింజల్లో అనేక  పోషక విలువలున్నాయి.  కోవిడ్ సమయంలో గుమ్మడి గింజలు   ఉపయోగం బాగా పెరిగింది

గుమ్మడి గింజలలో విటమిన్ ఎ, సి, ఈ, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ మొదలైన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు.

గుమ్మడికాయ గింజలు తింటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి.ఇందులో ఉండే విటమిన్ ఈ రక్తనాళాలను బలపరుస్తుంది.

రోజూ ఒక చెంచా గుమ్మడి గింజలను తినటం వల్ల  శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండెకు సంబంధించిన అన్ని సమస్యలు అదుపులో ఉంటాయి

ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారు తప్పనిసరిగా గుమ్మడి గింజలను తినాలి. గుమ్మడి గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో కాల్షియం లోపం దీని వినియోగం ద్వారా నెరవేరుతుంది. ఎముకలు దృఢంగా ఉండి బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది

ఆయుర్వేదంలో అన్ని రోగాలకు మూలం ఉదరంగా చెపుతుంటారు. కానీ గుమ్మడికాయ గింజలు పొట్టకు చాలా మంచివి.  అవి మన జీర్ణవ్యవస్థను సరిచేయడానికి పని చేస్తాయి

గుమ్మడి గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి

విటమిన్ ఎ, ఈ గుమ్మడికాయ గింజలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి కళ్ళకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే జింక్ విటమిన్ కాలేయం నుంచి కంటి రెటీనా వరకు రక్త సరఫరా వేగం చేస్తుంది.

ఇది మెలనిన్‌ను ఉత్పత్తి. చేస్తుంది. ఇది కళ్లను రక్షిస్తుంది కళ్లకు రంగును అందిస్తుంది. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది.. సో.. ఇన్ని ఉపయోగాలు ఉన్న  గుమ్మడి గింజలు తినటం మొదలెడతారుగా..