సీతమ్మ మెచ్చిన అద్భుతమైన ఫలం సీతాఫలం. సీతాఫలం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం…
అల్సర్ వ్యాధితో బాధపడేవారు సీతాఫలాన్ని తింటే త్వరగా కోలుకుంటారు.
గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధకత పెరగడానికి సహాయపడుతుంది. గర్భస్రావాన్ని నివారిస్తుంది.
సీతాఫలాన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చిన్న వయస్సులోనే కంటి సమస్యలు ఉన్న పిల్లలకు ఈ పండు చక్కటి ఫలితాన్నిస్తుంది.
సీతాఫలంలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల బ్రోంకైల్ ఇన్ప్లమేషన్ తగ్గించి ఆస్త్మాటిక్స్ అటాక్ ను తగ్గిస్తుంది.
రక్తహీనత ఉన్నవారు,గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ లోపం ఉన్న మహిళలకు చక్కటి ప్రయోజనకారి.
సీతాఫలంలో మెగ్నీషీయం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది.
సీతాఫలంలో రోగనిరోధక శక్తి చాలా ఉంది. ఊబకాయాన్ని నివారిస్తుంది.
బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.