మధుమేహం నియంత్రణ  ఆహారం, శారీరక వ్యాయామంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.

ముఖ్యంగా వేసవిలో శరీరంలో నీటి పరిమాణం తగ్గకుండా,  రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

తీసుకునే ఆహారం..పానీయాల విషయంలో జాగ్రత్తలు మధుమేహం ఉన్నవారికి చాలా చాలా అవసరం..

కొబ్బరి నీరు చాలా మంచిది..చక్కెర వేయని నిమ్మరసం మంచిది..

హెర్బల్ టీ,  గ్రీన్ టీ, బ్లాక్ టీ నిరంభ్యంతరంగా తాగవచ్చు..

కీరదోస జ్యూస్ తాగటం మంచిది..

ఇక ఆహారం విషయానికి వస్తే..పాలకూర, కాలీఫ్లవర్, బీన్స్ తీసుకోవచ్చు.

దీనికితోడు కొంత వ్యాయామం చేయడం చాలా చాలా మంచిది.

బ్రెడ్డు, రైస్, ఆలుగడ్డల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవి గ్లూకోజ్ ను పెంచుతాయి. కాబట్టి పీచు ఉండి, ఆకుపచ్చగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది.

ఇక పండ్ల విషయానికి వస్తే..స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీలు తినవచ్చు..

కమలా, నారింజ పండ్లు, ప్లమ్స్, పియర్స్ తీసుకోవచ్చు.

తాజా పండ్లలో ఎక్కువ శాతం రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరిగేందుకు కారణం కావు.కాబట్టి తాజా పండ్లే తీసుకోవాలి