ఊబకాయం, గుండె జబ్బులు వంటి ప్రమాదాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆహార అలవాట్లుమార్చుకోవాలి.

పసుపులో ఔషధగుణాలతో పాటు యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు, శరీరంలోని కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి,కొవ్వును కరిగిస్తుంది.

శరీరంలోని కొవ్వు కరిగించుకోవాలంటే, తేనె ఒక అద్భుత ఔషధంగా చెప్పవచ్చు. శరీరంలోని కొవ్వులు కరిగించటంలో తేనె ప్రభావ వంతంగా పనిచేస్తుంది.

ఉల్లిపాయలోని రసం శరీరంలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి, కొవ్వును కరిగిస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వులు కరిగించటంలో ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది.

ఆహారాన్ని అధిక మోతాదులో తీసుకున్న సందర్భంలో యాలకను నోట్లో వేసుకొని నమలటం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తుంది.

వెల్లుల్లిలో కొవ్వు కరిగించే కొన్ని యాసిడ్స్ పుష్కలంగా ఉండి, ఇన్సోలబుల్ ఫ్యాట్స్ ను కరిగిస్తుంది.

కప్పు రాగుపిండి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే బరువు తగ్గటంతోపాటు, కొవ్వులు కరిగిపోతాయి.

పచ్చిమిర్చిలోని పెప్పైన్ కంటెంట్ కొవ్వు కరగించడానికి అద్భుతంగా సమాయపడుతుంది.

ఓట్ మీల్ అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. ఓట్స్ ఫ్యాట్ ను కరిగించడం మాత్రమే కాదు. బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.

త్వరగా బరువు తగ్గాలనుకొనే వారు, క్యాబేజ్ జ్యూస్ బాగా హెల్ప్ అవుతుంది.

ఉడికించి గుడ్లు ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ప్రతి రోజూ రెండు గుడ్లను ఉడికించి తీసుకోవచ్చు. అందులోని తెల్లని పదార్ధాన్ని మాత్రమే తీసుకోవటం మంచిది.