మన శరీరంలో అత్యంత సంక్లిష్టమైన అవయవాలలో గుండె ఒకటి.

గుండె ఒక్క సెకను ఆగితే చాలు.. మనిషి ప్రాణానికే ముప్పు వస్తుంది. 

గుండెను ఆరోగ్యంగా ఉంచే పండ్లు అనేకం ఉన్నాయి.

 ప్రతీరోజూ దానిమ్మ రసం తాగటం వల్ల రక్తనాళాలలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడవు.

అవకాడోలో గుండెకు ఎంతో మేలు చేసే పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

 అవకాడోకు చెడు కొలస్ట్రాల్‌ను నియంత్రించే గుణం ఉంది.

చెడు కొలస్ట్రాల్‌ ఎంత తక్కువ ఉంటే గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది. 

శరీరానికి ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించటంలో పుచ్చకాయ తోడ్పడుతుంది.

పుచ్చకాయలో ఉండే సిట్రూలైన్‌ అనే అమినో యాసిడ్‌ వల్ల బ్లడ్‌ ప్రెషర్‌ తగ్గుతుంది. 

స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ లాంటి పండ్లు తినటం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ తగ్గుతుంది.

బెర్రీలలో యాంథోసైనాన్స్‌ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.