భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను స్వాతంత్రోద్యమ తీవ్రవాదులుగా పేర్కొంటూ ముగ్గుర్ని ఒకేసారి ఉరి తీసింది బ్రిటిష్ ప్రభుత్వం.
1931 మార్చి 24న లాహోర్ జైల్లో వీరిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేయగా..
దానికంటే ముందు రోజే రాత్రి 7.30 గంటలకు విప్లవకారులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం.
చివరి కోరికగా తమను ఉద్యమకారులుగా భావిస్తూ తుపాకీతో కాల్చి చంపాలని కోరినా పట్టించుకోలేదు.
భగత్ సింగ్ కళ్లలో బాధ, ఆందోళన కనిపించలేదు. ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిందని ఉరితాడును ముద్దాడి తగిలించుకున్నాడు.
''దిల్ సే నిక్‌లేగీ న మర్‌కర్ భీ వతన్ కీ ఉల్ఫత్.. మేరీ మిట్టీ సే భీ ఖుష్బూ వతన్ ఆయేగీ'' అంటూ ముగ్గురు గళమెత్తారు.
ప్రాణాలు తీశారు కానీ, వారి శరీరాలు దేశ పౌరులకు అందిస్తే అంతిమ యాత్రలు చేస్తారనే భయంతో జైలు దాటించేందుకు దారుణమైన ఆలోచన చేశారు.
ముక్కలుముక్కలుగా కోసి జైలు దాటించి సెట్లైజ్ నది ఒడ్డుకు చేర్చారు. మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్లాన్ చేసి మధ్యలోనే నదిలోకి విసిరేశారు.
అది గమనించిన గ్రామస్థులు చిందరవందరగా పడి ఉన్న మృతదేహాలకు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.
మార్చి 24 ఉదయం ఈ విషయం దేశవ్యాప్తంగా తెలిసి బ్రిటీష్ పాలనపై ఆగ్రహావేశాలు రేకెత్తించింది.
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను స్వాతంత్రోద్యమ తీవ్రవాదులుగా పేర్కొంటూ ముగ్గుర్ని ఒకేసారి ఉరి తీసింది బ్రిటిష్ ప్రభుత్వం.