అంతరిక్షంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా పుట్టిన రోజు నేడు..

కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా రాష్ర్టంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించారు.

ఆమె స్కూల్ విద్యను కర్నాల్ లోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్ లో పూర్తిచేశారు. పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లారు.

1984లో అమెరికాలోని టెక్సాన్  విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.  986లో చావ్లా ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో తన పీహెచ్ డీ చేశారు.

1988లో నాసాకు చెందిన అమెస్ రీసెర్చ్  సెంటర్ లో ఉద్యోగంలో చేరారు. అలా అంచలంచెలుగా ఎదుగుతూ నాసాకు వైస్ ప్రెసిడెంట్ గానూ సేవలు అందించారు.

1991 ఏప్రిల్ లో ఆమెకు అమెరికా పౌరసత్వం లభించింది... తరువాత ఆమె నాసా ఆస్ట్రోనాట్ కార్ప్ కు దరఖాస్తు చేసుకున్నారు.

చావ్లా మొట్టమొదటి అంతరిక్ష మిషన్ STS -87 అంతరిక్ష నౌకలో 1997 నవంబర్ 18న ప్రారంభమైంది.  ఆమెతో పాటు ఆరుగురు -వ్యోమగాములు STS -87 నౌకలో ప్రయాణించారు.

2003 జనవరిలో STS-107 అంతరిక్ష నౌకలో ఆమె రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లి 16 రోజలు గడిపి 80 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు.

2003 ఫిబ్రవరి 1న అంతరిక్షం నుంచి భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కల్పనతో పాటు ఆమెతో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు సిబ్బంది కూడా మరణించారు.

ఆమె ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక కొలంబియాలో షెడ్యూల్ ల్యాండింగ్ కు 16 నిమిషాల ముందు అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో కుప్ప కూలిపోయింది. దీంతో ఆమె 40 ఏళ్ల వయస్సులోనే దుర్మరణం పాలయ్యారు.

కల్పనా చావ్లా గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం కల్పనా చావ్లా పురస్కారాన్ని 2003 నుంచి వివిధ రంగాల్లోని 15 మంది శక్తివంతమైన మహిళలకు అందజేస్తుంది.

కల్పన గౌరవార్థం భారత్ లో ఎన్నో విద్యాసంస్థలకు, స్కాలర్ షిప్ లకు, అవార్డులకు ఆమె పేరు పెట్టారు. యువ మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం 2004లో కల్పనా చావ్లా అవార్డును ఏర్పాటు చేసింది.

భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం 2003లో ప్రయోగించిన మెట్ శాట్ కు  కల్పనా చావ్లా పేరు పెట్టారు.