కష్టాన్ని నమ్ముకుంటే కాలమే కలిసి వస్తుందంటారు. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేత నుంచి జాతీయ అధ్యక్ష పదవి వరకు సాగిన జగత్ ప్రకాష్ నడ్డా (జేపీ నడ్డా) ప్రయాణం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో మోదీ, అమిత్ షా తర్వాత అత్యంత బలమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన జేపీ నడ్డా పుట్టినరోజు ఈరోజు. ఆయన గురించి కొన్ని సంగతులు చర్చిద్దాం

జేపీ నడ్డా 1960 డిసెంబరు 2న బిహార్ రాజధాని పాట్నాలో జన్మించారు.

వాస్తవానికి వారి కుటుంబం హిమాచల్ ప్రదేశ్ కు చెందినవారు. అయితే తల్లిదండ్రుల పాట్నాలో ఉండడం వల్ల, నడ్డా అక్కడే పుట్టారు

నడ్డాది రాజకీయ కుటుంబం. ఆయన అత్తగారు జయశ్రీ బెనర్జీ అప్పట్లో లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. నడ్డా రాజకీయాల్లోకి రావడానికి అదొక కారణం.

1993లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిలాస్‭పూర్ నియోజకవర్గం నుంచి నడ్డా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

1998లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవగానే రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు.

2014లో మొదటిసారి రాజ్యసభ ద్వారా పార్లమెంటులో అడుగుపెట్టారు. అనంతరమే ఆయనను మోదీ తన కేబినెట్‭లోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చారు.

2019 వరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‭గా పని చేసిన నడ్డా.. 2020 జనవరి 20 పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

అమిత్ షా లాగే నడ్డా సైతం పార్టీలో మంచి స్ట్రాటజిస్ట్ అని అంటుంటారు. కష్టపడేతత్వం, సున్నితత్వం ఎక్కువ అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

మల్లిక నడ్డాతో 1991లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు