గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనేక రికార్డులు తిరగరాసింది. వరుస విజయాలు, అత్యధిక సీట్లు, మోదీ మేనియా.. ఇలా చెప్పుకుంటూ పోవడమే. కనివినీ ఎరుగని రీతిలో వచ్చిన గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఓ లుక్కేద్దాం

గుజరాత్‭లో బీజేపీ వరుసగా ఏడోసారి విజయం సాధించింది. ఇన్నిసార్లు ఏ పార్టీ గుజరాత్‭లో గెలవలేదు.

గుజరాత్ అసెంబ్లీలో 156 స్థానాలు గెలుపొంది బీజేపీ భారీ రికార్డును సాధించింది. ఇప్పటి వరకు ఏ పార్టీ ఇన్ని సీట్లు గెలవలేదు.

గతంలో కాంగ్రెస్ పార్టీ పేరుమీదున్న అత్యధిక స్థానాల (141) రికార్డును బీజేపీ బద్ధలు కొట్టింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ 52 శాతం ఓట్ బ్యాంక్ సాధించింది. ఇది కూడా రికార్డ్ ఓట్ బ్యాంక్.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

27 శాతం ఓట్లతో కేవలం 17 సీట్లు మాత్రమే గెలిచింది. ఇది కాంగ్రెస్ పార్టీకి చారిత్రక ఓటమి.

ఇదే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతంగా రాణించింది. ఐదు స్థానాలే గెలిచినప్పటికీ 13 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో ఆప్‭కు జాతీయ హోదా దాదాపుగా డిక్లేర్ అయినట్లే.