నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే ఆయన వదులుకున్న కొన్ని బ్లాక్‌బస్టర్ చిత్రాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

చంటి.. వెంకటేష్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా కథ తొలుత బాలయ్య వద్దకు వెళ్లగా, ఆయనకు కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు.

అక్కినేని నాగార్జున, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన ‘జానకిరాముడు’ సినిమాను కూడా తొలుత బాలయ్య చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఆయన వదులుకున్నారు.

సింహరాశి చిత్రాన్ని దర్శకుడు వి.సముద్ర తొలుత బాలయ్యతో తెరకెక్కించాలని చూసినా, అది కుదరకపోవడంతో రాజశేఖర్‌తో తెరకెక్కించి హిట్ కొట్టారు.

సూర్యవంశం.. వెంకటేష్ డ్యుయెల్ రోల్ చేసిన ఈ సినిమా కథ ముందుగా విన్న బాలయ్య, ఇది ‘పెద్దన్నయ్య’ సినిమాను పోలి ఉందని రిజెక్ట్ చేశాడట.

శివరామరాజు.. ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ చేసిన పాత్రను తొలుత బాలయ్య చేయాల్సిందిగా కోరగా, ఆయన సున్నితంగా తిరస్కరించాడట.

అన్నవరం.. ఈ సినిమాను కూడా తొలుత బాలయ్య చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లింది.

బాడీగార్డ్.. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్ర కథను మొదట బాలయ్యకు వినిపించగా, ఈ చిత్ర రీమేక్ హక్కులు బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు. దీంతో బాలయ్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.

సైరా నరసింహారెడ్డి.. పదేళ్ల కిందటే ఈ సినిమా బాలయ్య చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేకపోయింది.

సింహాద్రి.. రాజమౌళి తొలుత ఈ సినిమా కథను బాలయ్యకు వినిపించగా, ఆయనకు కథ నచ్చలేదని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.

క్రాక్.. గోపీచంద్ ఈ సినిమాను కూడా బాలయ్యతో చేయాలని చూసినా, ఆయనకు కథ నచ్చకపోవడంతో రవితేజతో కానిచ్చేశారు.